నిన్న వెలువడిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో యూపీ ఫలితాలు మాత్రం చాలా ప్రత్యేకం అని చెప్పాలి. ఈ ఎన్నికల ఫ్లీర్థంలో సీఎం గా ఉన్న బీజేపీ నాయకుడు యోగి ఆదిత్యా నాథ్ సంచలన విజయం సాధించడమే కాకుండా రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ సీఎంకు దక్కని అరుదైన ఘనతను సాధించాడు. 1971 సంవత్సరం నుండి నేటి వరకు యూపి సీఎంలుగా చేసిన వారు ఎవ్వరూ కూడా మరుసటి ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. కానీ మొదటి సారిగా యోగి ఆదిత్యా నాథ్ సీఎంగా చేసి తర్వాత జరిగిన ఎన్నికల్లో గోరఖ్ పుర్ అర్బన్ నుండి పోటీ చేసి విజయభేరి మోగించాడు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ తన హవాను కొనసాగించింది.

ఇక్కడ ఉన్న 403 అసెంబ్లీ స్థానాల్లో 273 స్థానాలలో విజయం సాధించి అధికారాన్ని ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉంది. ఈ గెలుపు బీజేపీ ఊహించినదే అయినప్పటికీ అంత సులభంగా అయితే దక్కలేదు అని రాజకీయ ప్రముఖులు అంటున్నారు. యూపీ లో బీజేపీ ఇంతటి అఖండ విజయం సాధించడం వెనుక కొన్ని ముఖ్య కారణాలున్నాయని తెలుస్తోంది. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

* రైతు చట్టాలు రద్దు: గతంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న అతి చెత్త నిర్ణయాలలో కొత్తగా తీసుకు వచ్చిన మూడు రైతు చట్టాలు నిర్ణయం ఒకటి. అయితే దేశ వ్యాప్తంగా రైతుల నుండి ఆగ్రహ జ్వాలలు రేగడంతో తేరుకున్న మోదీ ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేసింది.

* అయోధ్య రామాలయం: అయోధ్య గురించి గతంలో ఎన్ని వివాదాలు జరిగాయో తెలిసిందే. అందుకే హిందువుల సెంటిమెంట్ కు గుర్తుగా చెప్పిన విధంగా అయోధ్య రామాలయాన్ని నిర్మించి మోదీ తన మాటను నిలబెట్టుకున్నాడు.

* త్రిమూర్తుల వ్యూహం: ప్రస్తుతం దేశంలో బీజేపీ ఆధిపత్యంలో మోదీ - అమిత్ షాల పాత్ర ఎంత కీలకం అన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.  అయితే యూపీ రాష్ట్రం విషయానికి వస్తే ఇద్దరు కాస్త ఇక్కడ ముగ్గురు అయ్యారు. మోదీ - అమిత్ షా లకు తోడు సీఎం యోగి ఆదిత్యా నాథ్ తోడయ్యారు. ముగ్గురు కలిసి వేసిన వ్యూహాలు మరియు ఎన్నికల ముందు చేసిన ప్రచారం అన్నీ కూడా చాలా ప్లస్ అయ్యాయి.

* సమాజ్ వాదీ పార్టీ పై ప్రజల్లో వ్యతిరేకత: యూపీ లో బీజేపీకి పోటీ ఇచ్చే పార్టీ సమాజ్ వాదీ పార్టీ ఒక్కటే అని చెప్పాలి. గత కొంత కాలంగా అఖిల్ యాదవ్ సారథ్యంలో పార్టీ ప్రజల్లో కొంత నమ్మకాన్ని పొందగలిగింది. అయితే ఎస్పీ కి పాజిటివ్ గా ఉన్న అంశాలను ప్రజల్లో వ్యతిరేకత కలిగేలా చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఎస్పీ ఒక యాదవ ముస్లిం పార్టీ అని ప్రజలకు చెప్పడంలో యోగి సక్సెస్ అయ్యాడు.

* యోగి పై అవినీతి లేకపోవడం: రాజకీయాలలో అత్యంత కీలకంగా వ్యవహరించేది అవినీతి అంశం. ఇక్కడ సీఎంగా ఉన్న యోగి పై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం బిగ్గెస్ట్ ప్లస్ అయింది. అందుకే యోగి చెప్పిన మాటలు ప్రజలను ఒప్పించాయి మరియు మెప్పించాయి.

ఇలా పైన చెప్పిన 5 కారణాలతో యూపీ లో బీజేపీ అఖండ విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: