ఈరోజుల్లో మద్యం, మాంసం లకు మంచి డిమాండ్ ఉందన్న విషయం అందరికి తెలిసిందే..అందుకే చాలా హోటల్స్ కూడా నాన్ వెజ్ ను ఎక్కువగా తయారు చేస్తూ భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నారు. అలాంటిది ఒక్క రోజు ముక్క లేనిది ముద్ద దిగధు.కాగా, తొమ్మిది రోజులు మాంసం దుకాణాలను బంద్ చేస్తె ఇక పరిస్థితి ఎలా వుంటుందో ఊహించూకోవడం కష్టమే..ఇప్పుడు ఓ రాష్ట్రంలో తొమ్మిది రోజులు దుకాణాలను మూసి వేస్తున్నట్లు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తొమ్మిది రోజులు దుకాణాల ను మూసి వేయడం పై వ్యాపారులు ఆందోళన ను వ్యక్తం చెస్తున్నారు.


నగర వ్యాప్తంగా నిషేధం విధించడం తో తాము ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతామని వెల్లడిస్తున్నారు. ఘజియాబాద్ లో 9 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగతున్న సందర్భంగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 2022, ఏప్రిల్ 02 వ తేదీ శనివారం ప్రారంభమైన ఉత్సవాలు ఏప్రిల్ 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఘజియాబాద్ లో నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మాంసం దుకాణాలు మూసివేయాలని చెప్పడం ఇదే ఫస్ట్ టైమ్.. అంతేకాదు మద్యం దుకాణాలను ఇలా ఓపెన్ చెయ్యడం పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..


మాకు ఎటువంటి ఆధారమూ లేదు.. దుకాణాలతో నే రూపాయి సంపాదించుకుంటున్నాము. ఇప్పుడు చేయడం బాధగా ఉందని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. పచ్చి మాంసాన్ని ఆలయ పరిసర ప్రాంతాల్లో విక్రయించకూడదని, ఇలా ప్రతిసారి జరుగుతుందన్నారు. తాము ఒకరికి లాభం, మరొకరికి నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించమని మేయర్ స్పష్టం చేశారు.మాంసం, మద్యం వేర్వేరు అని, వీటిని ఒకదానితో ఒకటి చూడలేమన్నారు. మతపరమైన సెంటిమెంట్ కు సంబంధించింది. నవరాత్రుల సందర్భంగా మాంసం దుకాణాల వద్ద పారిశుధ్యం మెరుగ్గా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ విషయం తో స్థానికంగా వున్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఈ విషయం పై మరో ప్రకటన వస్తుందేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: