తాజాగా వైరల్ అవుతున్న హైదరాబాద్ బంజారాహిల్స్ డ్రగ్స్ కేసుకి సంబంధించి పోలీసుల దాడిలో దొరికిన 45మంది రక్త నమూనాలు సేకరిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. వీళ్లంతా కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం ఉందని కమిషనర్ తెలిపారు. ఇక విధుల్లో నిర్లక్ష్యం వహించారని సీఐ శివచంద్రపై సస్పెన్షన్ వేటు వేసినట్టు నగర కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఏసీపీ సుదర్శన్ కు చార్జ్ మెమో కూడా జారీ చేశామని కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు కొత్త సీఐ నియామకం అయ్యారు.ఇక కొత్త సీఐగా నాగేశ్వరరావు నియామకం అయ్యారు. ప్రస్తుతం నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ సీఐగా ఉన్న నాగేశ్వరరావు ఇంకా ఆరేళ్లుగా టాస్క్ ఫోర్స్ లోనే పనిచేస్తున్నారు.ఇక ఈ పబ్ లో డెకాయ్ ఆపరేషన్ ను కూడా నిర్వహించింది నాగేశ్వరరావు టీం కావడం గమనార్హం. డ్రగ్స్ గుట్టు బయటపెట్టింది కూడా ఈయనే. గతంలో ఎన్నో సెన్సేషనల్ కేసుల గుట్టు తేల్చారు నాగేశ్వరరావు. దీంతో ఈ కేసు విచారణని నాగేశ్వరరావుకు ప్రభుత్వం అప్పగించింది.



ఇక ప్రస్తుతం బంజారాహిల్స్ సీఐ శివచంద్రపై గతంలో పలు సెటిల్ మెంట్ ఆరోపణలు పబ్ లపై నిఘా పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో ఆయనపై సస్పెన్షన్ వేటుని వేశారు. ఈ కేసు తారుమారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ఆరోపణలున్నాయి. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడకుండా నిరాకరించడం ఇంకా దురుసుగా ప్రవర్తించడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు సమాచారం తెలిసింది. వెంటనే అతడిపై వేటు వేసినట్టు సమాచారం తెలిసింది.ఇక ఈ కేసులో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారని తేలడంతో పోలీసులు కేసును పెద్ద సవాల్ గా తీసుకున్నారు. ఈ డ్రగ్స్ విషయంలో నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. దీంతో ఇతడిని సీఐగా నియమిస్తే కేసు ఓ కొలిక్కి వస్తుందని అంతా భావిస్తున్నారు. సీఐగా నాగేశ్వరావును నియమించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: