సూదికోసం సంతకెళితే అసలు విషయం బయటపడిందనే సామెత తెలుగులో చాలా పాపులర్. ఇపుడు తెలుగుదేశంపార్టీ వ్యవహారం అలాగే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే మహానాడు వేదికమీద నుండి లోకేష్ మాట్లాడుతు పార్టీకి 30 నియోజకవర్గాల్లో ఇన్చార్జీలే లేరన్నారు. మరో 40 నియోజకవర్గాల్లో ఆధిపత్యపోరు చాలా తీవ్రంగా ఉందన్న విషయాన్ని కూడా బయటపెట్టారు. మరో 50 నియోజకవర్గాల్లో ఇన్చార్జీల పైన నేతల్లో బాగా అసంతృప్తి ఉందన్న విషయాన్ని నేతలు బయటపెట్టారు.






అంటే పార్టీ లోగుట్టును లోకేష్ కాస్త బయటపెడితే కొందరు నేతలు మరో విషయాన్ని కూడా బయటపడేశారు. అంటే లోకేష్+పార్టీ నేతలు స్వయంగా చెప్పుకున్న ప్రకారమే పార్టీ పరిస్ధితి 120 నియోజకవర్గాల్లో ఏమీ బావోలేదని అర్ధమవుతోంది. ఈ 120 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితి ఎప్పటికి బాగుపడుతుంది ? 30 నియోజకవర్గాల్లో మూడేళ్ళుగా చంద్రబాబునాయుడు ఇన్చార్జిలను ఎందుకు వేయలేకపోయారు ? వేయలేకపోవటం కాదు బాధ్యతలు తీసుకోవటానికి నేతలే ముందుకురాలేదు.






అలాగే 40 నియోజకవర్గాల్లో ఆధితప్యపోరు తీవ్రంగా ఉన్నా ఆ పంచాయితీలను సర్దుబాటు చేసేందుకు చంద్రబాబు పెద్దగా దృష్టిపెట్టలేదు. అలాగే 50 నియోజకవర్గాల్లో ఇన్చార్జిలపై తీవ్రమైన అసంతృప్తున్నా వాటిని సర్దుబాటు చేసే విషయాన్ని కూడా చంద్రబాబు పట్టించుకోలేదని అర్ధమవుతోంది. 175 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితి 120 నియోజకవర్గాల్లో సరిగాలేదని అర్ధమైపోతోంది. మరి అచ్చెన్నాయుడు చెప్పినట్లు పార్టీ వచ్చే ఎన్నికల్లో 160 నియోజకవర్గాల్లో ఎలా గెలుస్తుంది ? 120 నియోజకవర్గాల పరిస్ధితిని వదిలేస్తే మిగిలిన 50 నియోజకవర్గాల్లో పార్టీ ఎన్నింటిలో గెలుస్తుంది ?






సో టోటల్ గా అర్ధమవుతున్నదేమంటే  160 సీట్లు ఖాయమని, అధికారంలోకి వచ్చేది తామేని చంద్రబాబు, అచ్చెన్న, లోకేష్ చెబుతున్నదంతా కేవలం నేతలు, కార్యకర్తలను ఎంకరేజ్  చేయటం కోసమే అని క్లియర్ గా అర్ధమైపోతోంది. షెడ్యూల్ ఎన్నికలు రెండేళ్ళలో ఉన్నా 120 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితి బావోలేదని స్వయంగా వేదికమీద నుండి వాళ్ళే చెప్పుకున్న తర్వాత వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఎవరైనా ఎలా నమ్మకం పెట్టుకుంటారు ?

మరింత సమాచారం తెలుసుకోండి: