తాజా పరిణామాలను చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మిత్రపక్షమని కూడా బీజేపీ నేతలు చూడకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పక్కన పెట్టేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఈనెల 6వ తేదీన ఢిల్లీలో నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశం జరగబోతోంది. ఆజాదీకి అమృతోత్సవ్ కార్యక్రమం నిర్వహణ కోసం మోడీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి దేశంలోని అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రతిపక్షపార్టీల నేతలకు  కూడా ఆహ్వానాలు అందాయి.





సరే రాష్ట్రం నుండి జగన్మోహన్ రెడ్డితో పాటు చంద్రబాబునాయుడు కూడా ఢిల్లీకి వెళుతున్నారు. అంతా బాగానే ఉందికానీ మరి పవన్ కల్యాణ్ పరిస్ధితి ఏమిటి ? జనసేన కూడా రాష్ట్రంలో ప్రతిపక్షమే. పైగా బీజేపీకి మిత్రపక్షం కూడా. అయినా పవన్ కు మాత్రం మోడీ దగ్గర నుండి ఆహ్వానం అందలేదు. అంటే పవన్ను ప్రతిపక్ష నేతగానే కాకుండా కనీసం మిత్రపక్షం నేతగా కూడా బీజేపీ చూడటంలేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.






మోడీ దగ్గర నుండి పవన్ కు ఆహ్వానం అందుంటే టీడీపీ వాళ్ళు చేస్తున్నట్లే జనసేన నేతలు కూడా తెగ హడావుడి చేసేసేవారే అనటంలో సందేహంలేదు. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత మళ్ళీ మోడీకి దగ్గరవ్వాలని చంద్రబాబు ఎంతగా ప్రయత్నంచేస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ప్రయత్నాలను మోడీ అసలు పట్టించుకోవటమేలేదు.






దాంతో మోడీకి ఎలాదగ్గరవ్వాలో చంద్రబాబుకు దిక్కుతోచటంలేదు. సరిగ్గా ఈ సమయంలోనే 6వ తేదీ సమావేశానికి రావాలంటు చంద్రబాబుకు ఆహ్వానం అందింది. దీన్నిపుడు టీడీపీ, ఎల్లోమీడియా చాలా గొప్పగా చెప్పుకుంటున్నది. పవన్ పరిస్ధితి కూడా సేమ్ టు సేమ్. దాదాపు రెండేళ్ళుగా మోడీని కానీ కనీసం అమిత్ షా ను కాని కలవాలని పవన్ ఎంత ప్రయత్నించినా సాధ్యంకావటంలేదు. మొన్నటి భమీవరం బహిరంగసభలోనూ అవకాశం రాలేదు. ఇపుడు ఆహ్వానమే వచ్చినట్లు లేదు. జరుగుతున్నది చూస్తుంటే పవన్ను బీజేపీ అసలు పట్టించుకుంటున్నట్లే లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: