అమెరికా మరోసారి సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. అల్ ఖైదా అధినేత అల్ జవహరిని హతం చేసింది. గతంలో అల్ ఖైదా అధినేత బిన్ లాడెన్ ను ఎలా హతమార్చిందో.. సరిగ్గా ఇప్పుడు కూడా అలాగే అదే సంస్థ అధినేతను అమెరికా మట్టుబెట్టింది. 2011లో పాకిస్తాన్‌ లో దాక్కుని ఉన్న బిన్ లాడెన్‌ ను అమెరికాకు చెందిన నేవీ సీల్స్ హతమార్చాయి. తాజాగా కాబూల్ సమీపంలో అల్ జవహరిని అమెరికై సైన్యం మట్టుబెట్టింది. ఈమేరకు అమెరికా అధికారులు ప్రకటన విడుదల చేశారు.

విచిత్రం ఏంటంటే.. బిన్ లాడెన్ ని చంపేందుకు సైనిక ఆపరేషన్ చేపట్టారు. ఆయన రహస్య నేలమాళిగలోకి అమెరికా సైన్యం దూసుకెళ్లింది. ఒక్కసారిగా ఆపరేషన్ పూర్తి చేసింది. కానీ ఈసారి మాత్రం ఒక్క సైనికుడు కూడా ఫీల్డ్ లోకి దిగలేదని సమాచారం. కేవలం డ్రోన్ల ద్వారానే ఈ ఆపరేషన్ చేపట్టారు. డ్రోన్లు ఉపయోగించి అల్ జవహరిని హతమార్చింది అమెరికా. అమెరికా మీడియా కూడా అల్ జవహరి హత్యపై వరుస కథనాలు ప్రచురించింది. ఈరోజు సాయంత్రం అమెరికా అధ్యక్షుడు ఈ సీక్రెట్ ఆపరేషన్ కి సంబంధించిన వివరాలు వెల్లడిస్తారని సమాచారం.

అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చాన్నాళ్లుగా అల్ జవహరి గురించి గాలిస్తోంది. గతంలో అమెరికాలోని ట్విన్ టవర్సా పై జరిగిన దాడిలో అల్ జవహరి కూడా కీలక సూత్రధారి అంటున్నారు. అప్పట్లో జరిగిన దాడిలో దాదాపు 3వేలమంది మహణించారు. వేల కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగింది. దీంతో అప్పట్లోనే సీఐఏ.. అల్ జవహరిని మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదుల లిస్ట్ లో చేర్చింది. ఆ తర్వాత తీవ్రంగా గాలించి చివరకు మట్టుబెట్టింది. కాబూల్‌ లోని షేర్పూర్ ప్రాంతంలో వైమానిక దాడి ద్వారా అల్ జవహరి చనిపోయినట్టు సమాచారం. తాలిబన్ ప్రతినిధి దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్టింగ్ ఉంచారు. దీంతో అల్ జవహరి మరణంపై అనుమానాలు వీగిపోయాయి. అయితే ఈ దాడి పూర్తిగా టెక్నికల్ గా నిర్వహించడం గమనార్హం. డ్రోన్ ద్వారా పేలుడు పదార్ధాలను జాడవిరిచి అల్ జవహరిని మట్టుబెట్టారు. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలంగా మారింది. అల్ ఖైదాను అల్ జవహరి నిర్వహిస్తున్నారు. బిన్ లాడెన్ తర్వాత అంత పేరుమోసిన ఉగ్రవాదిదా అల్ జవహరి అమెరికా హిట్ లిస్ట్ లో చేరారు. ఒక్కొక్కరినీ ఏరివేస్తూ వచ్చిన అమెరికా చివరకు అల్ జవహరిని కూడా హతమార్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: