గత సంవత్సరం హిజాబ్ దేశ వ్యాప్తంగా ఎంత దుమారాన్ని రేపిందో తెలిసిందే. హిందూ ముస్లిం మతాల మధ్యన ఒక పెద్ద చిచ్చుకు తెరలేపింది. ఇది ముందుగా కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలో స్టార్ట్ అయింది. అలా రోజురోజుకు పెరిగి పెద్దది అవడంతో ఈ పంచాయితీ కోర్ట్ కు చేరింది. అయితే ఈ విషయం రాష్ట్ర హై కోర్ట్ లో తేలేది కాదని... సుప్రీం కోర్ట్ ధర్మసనం ముందుకు వెళ్ళింది. అయితే ఈ విషయాన్ని సుప్రీం కోర్ట్ కూడా చాలా సమయం తీసుకుని తాజాగా తమ తీర్పును వెల్లడించింది. అయితే ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులు ఎవరికి తోచినట్లు వారు చెప్పడం ఇప్పుడు చర్చకు దారి తీసింది.

అందులో హిజాబ్ కు మద్దతుగా జస్టిస్ హేమంత్ గుప్తా తీర్పును ఇవ్వగా , మరొక న్యాయమూర్తి జస్టిస్ దులీప్ మాత్రం దీనిని తప్పు పట్టారు. అలా కర్ణాటక ప్రభుత్వానికి మద్దతుగా, ఆ రాష్ట్ర హై కోర్ట్ సపోర్ట్ చేయగా... ఇప్పుడు సుప్రీం కోర్ట్ న్యాయయమూర్తులలో ఒకరైన జస్టిస్ దులీప్ కూడా ఇందుకు మద్దతుగా నిలిచారు. ఇలా దేశంలో ఎన్నో కేసులు స్థానికంగా పరిష్కారం కాకపోతే, సుప్రీం కోర్ట్ లో పరిష్కారం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు హిజాబ్ మీద రగిలిన చిచ్చు మాత్రం సుప్రీం కోర్ట్ లోనూ తేలలేదు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ వివాదం కాస్త విస్తృత ధర్మాసనం ఎదుటకు వెళ్లనుంది.

కాగా హిజాబ్ అనేది ముస్లిం ల హక్కు అంటూ అప్పట్లో చేసిన నిరసనలు మరియు నినాదాలు తెలిసిందే. అయితే విద్యార్థుల నుండి మొదలైన ఈ హిజాబ్ నిరసన రాజకీయ పార్టీల జోక్యం వరకు చేరింది. అయితే ఒక పాఠశాల అయినా కాలేజీ అయినా విద్యార్థులు అంతా సమానమే. ఇది అందరికీ తెల్సిన విషయమే. అలాంటప్పుడు మత పరమైన వస్త్రధారణ సరైన పద్ధతి కాదని.. సదరు విద్యాసంస్థలు విద్యార్థులకు తెలియచేశారు. మరి ఈ వివాదం తేలేది ఎప్పుడో ? కాగా త్వరలో సుప్రీం కోర్ట్ విస్తృత ధర్మాసనం ఏమి తెలుస్తుంది అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.  

 






మరింత సమాచారం తెలుసుకోండి: