పండుగ వచ్చింది అంటే చాలు సిటీలో ఉండేవాల్లు అందరూ తమ సొంత ఊర్లకు వెలతారు.ఎక్కడ చూసిన చాలా బిజీగా ఉంటారు..ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కూడా కొత్త నిర్ణయాలను తీసుకుంటూ వస్తుంది..ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమవుతుంటుంది. ఇప్పుడు దీపావళి పండగ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది.ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దీపావళి, ఛత్ పూజ సందర్భంగా ఈ నెల 22 నుంచి 28 వరకు 14 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఉత్తర రైల్వే ప్రకటించింది.


బీహార్, యూపీలకు భారీగా తరలివస్తున్న జనాలను దృష్టిలో ఉంచుకుని ఉత్తర రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది..
ప్రత్యేక రైళ్ల నిర్వహణతో రైళ్ల సంఖ్య పెరగడంతో పాటు రద్దీ తగ్గనుంది. దర్భంగా, సహర్సా, భాగల్‌పూర్, ముజఫర్‌పూర్, పాట్నా, బక్సర్, అరా, కతిహార్, అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్‌లకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.రైళ్ల సౌకర్యార్థం, ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేసేందుకు ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఉత్తర రైల్వే దీపావళి, ఛత్ పూజ కోసం అనేక రైళ్ల జాబితాను విడుదల చేసింది.


ఇక ఈ లిస్ట్ లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, బీహార్, జార్ఖండ్, బెంగాల్ సహా పలు మార్గాల్లో రైళ్లు నడుస్తున్నాయని పేర్కొన్నారు.ఉత్తర రైల్వే జాబితాలో, రైలు సంఖ్యతో పాటు, రైళ్ల రాక, బయలుదేరే సమయం కూడా ఇవ్వబడింది. రైలు నంబర్ 0404 ఢిల్లీ-దర్భంగా స్పెషల్ ఢిల్లీ జంక్షన్ నుండి 14:20కి బయలుదేరి 15:45కి దర్భంగా చేరుకుంటుంది. ఈ రైలు అక్టోబర్ 22 – అక్టోబర్ 28, 2022 న రెండు రౌండ్లలో నడుస్తుంది.అలాగే రైలు నంబర్ 04096 న్యూఢిల్లీ – అజంగఢ్ ప్రత్యేక రైలు న్యూఢిల్లీ నుండి 00.05 గంటలకు బయలుదేరి రాత్రి 18:00 గంటలకు అజంగఢ్ చేరుకుంటుంది. ఈ రైలు అక్టోబర్ 22 న నడుస్తుంది. రైలు నం. 04052 ఆనంద్ విహార్ – సహర్స స్పెషల్ 15:25 గంటలకు ఆనంద్ విహార్ టీఆర్‌ఎం నుండి బయలుదేరి 16:00 గంటలకు సహర్స జంక్షన్ చేరుకుంటుంది. ఈ రైలు అక్టోబర్ 27న నడుస్తుంది.


రైలు నెం. 04036 ఢిల్లీభాగల్పూర్ ప్రత్యేక రైలు ఢిల్లీ జంక్షన్ నుండి ఉదయం 09:00 గంటలకు బయలుదేరి 07:00 గంటలకు భాగల్పూర్ జంక్షన్ చేరుకుంటుంది. ఈ రైలు అక్టోబర్ 28న బయలుదేరుతుంది. రైలు నం. 04054 ఆనంద్ విహార్ టీఆర్‌ఎం – ముజఫర్‌పూర్ ప్రత్యేక రైలు ఆనంద్ విహార్ టీఆర్‌ఎం నుండి 12:00 గంటలకు బయలుదేరి 10:25 గంటలకు ముజఫర్‌పూర్ జంక్షన్ చేరుకుంటుంది. ఈ రైలు అక్టోబర్ 22 న ప్రారంభం కానుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: