క్రెడిట్ కార్డు వారికి గుడ్ న్యూస్..ఇప్పుడు భారీ డిస్కౌంట్ ను అందుకోవచ్చు..అయితే ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..క్రెడిట్ కార్డు ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారు ఏకంగా రూ. 25 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు వాడే వారికి ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్ నెల చివరి వరకు ఆఫర్లు లభిస్తాయని గుర్తించాలి. డిసెంబర్ 31తో ఈ ఆఫర్లు ముగుస్తాయి.


శాంసంగ్, సోనీ, ఎల్‌జీ, హయర్ వంటి పలు రకాల బ్రాండ్లపై తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ ప్రొడక్టులు కొనుగోలు చేస్తే 22.5 శాతం వరకు తగ్గింపు వస్తుంది. గరిష్టంగా రూ. 25 వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు ఉంటుంది. అలాగే సోనీ ప్రొడక్టులపై ఆఫర్ ఉంది. ఈ కంపెనీ ప్రొడక్టులకు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే 12.5 శాతం తగ్గింపు వస్తుంది. గరిష్టంగా రూ. 22,500 వరకు క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ జనవరి 2 వరకు ఉంటుంది..


అంతేకాదు..ఎల్‌జీ ప్రొడక్టులపై కూడా సూపర్ డీల్స్ పొందొచ్చు. ఈ కంపెనీ ప్రొడక్టులను కొనుగోలు చేస్తే 22.5 శాతం వరకు తగ్గింపు వస్తుంది. క్యాష్‌బ్యాక్ గరిష్టంగా రూ.20 వేల వరకు వస్తుంది. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఇక హయర్ ప్రొడక్టులపై అయితే 20 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. గరిష్టంగా రూ. 12 వేల వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు ఉంటుంది.. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందని ఎంచుకునే వారు 18 నెలల వరకు టెన్యూర్ ఎంచుకోవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా ఉంది. ఎంపిక చేసిన బ్రాండ్లకు ఇది వర్తిస్తుంది. అలాగే వోల్టస్, బాష్, క్యారియర్, రిలయన్స్ రిటైల్, బ్లూస్టార్, దైకిన్, డైసన్, లాయిడ్, గోద్రేజ్, క్రోమా, హిటాచీ, వర్ల్‌పూల్, టీసీఎల్, కెనాన్ వంటి ప్రొడక్టుల కొనుగోలుపై నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ ను పొందవచ్చు.. ఈజిగా ఈఎంఐ లో కొన్ని వస్తువులు కొనుగోలు చెయ్యొచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి: