జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో నేతను టార్గెట్ చేస్తుంటారు. ఒక్కోనేతను ఒక్కోసారి టార్గెట్ చేసి తర్వాత వాళ్ళ రెస్పాన్స్ చూసుకుని వదిలేస్తున్నారు.  ఇక్కడ విచిత్రం ఏమిటంటే గడచిన మూడున్నరేళ్ళల్లో పవన్ టార్గెట్ కు గురైన వాళ్ళల్లో అత్యధికులు కాపునేతలే కావటం. 2019 ఎన్నికల్లో గ్రంధి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, మెట్ల రమణబాబును బాగా టార్గెట్ చేశారు.





భీమవరంలో ప్రత్యర్ధి కాబట్టి గ్రంధిని టార్గెట్ చేశారని అనుకున్నా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పోటీచేసిన కన్నబాబును, అసలు పోటీయేచేయని టీడీపీ నేత మెట్ల రమణబాబును ఎందుకు టార్గెట్ చేసినట్లు ?  ఎన్నికలు అయిపోయిన దగ్గర నుండి పదే పదే పేర్నినాని, అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజాలను టార్గెట్ చేస్తున్నారు. సినిమా టికెట్ల ధరల విషయాన్ని అడ్డుపెట్టుకుని పేర్నిని బాగా టార్గెట్ చేశారు.





రిపీటెడ్ గా అంబటి, పేర్నినానితో పాటు దాడిశెట్టిపైన కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వీళ్ళందరితో పాటు రామచంద్రాపురంలో తోట త్రిమూర్తులను కూడా ఒకటిరెండుసార్లు టార్గెట్ చేసినా తర్వాత ఎందుకనో వదిలేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే పేర్ని, అంబటి, దాడిశెట్టి జనసేన అధినేత టార్గెట్ కు ఏమాత్రం భయపడకుండా రివర్స్ ఎటాక్ మొదలుపెట్టారు. నిజానికి పవన్ అంటే భయపడే వాళ్ళు వైసీపీలో ఎవరూ లేరు. కురసాల, గ్రంధి, తోట ఎందుకు కామ్ గా ఉన్నారంటే ఇపుడు పవన్ వాళ్ళజోలికి వెళ్ళటంలేదు కాబట్టే. తమగురించి ఎప్పుడు పవన్ మాట్లాడినా వెంటనే వాళ్ళు రివర్సులో వాయించేస్తున్నారు.





తాజాగా సత్తెనపల్లి పర్యటనలో ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి వార్నింగులిస్తూనే మరోవైపు అంబటిపై పదేపదే కామెంట్లు చేశారు. దానికి మంత్రి కూడా ధీటుగానే స్పందిస్తున్నారు. అసలు ఇదంతా పవన్ ఎందుకు చేస్తున్నారంటే కాపునేతలను టార్గెట్ చేయటం ద్వారా ఒత్తిడికి గురిచేసి లొంగదీసుకోవాలనే ప్లాన్ ఉన్నట్లు అనుమానంగా ఉంది. అయితే రాజకీయమే ఊపిరిగా బతికే ఫుల్ టైం పొలిటీషియన్లను లొంగదీసుకోవచ్చని పార్ట్ టైమ్ పొలిటీషియన్ పవన్ ఎలాగ అనుకున్నారో అర్ధంకావటంలేదు.


 





మరింత సమాచారం తెలుసుకోండి: