రాష్ట్రంలోని హై స్కూల్ పిల్లలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ట్యాబులను పంపిణీ చేసింది. 8వ తరగతి నుండి 10వ తరగతి మధ్యలో ఉండే స్టూడెంట్స్ కు సుమారు 5.5 లక్షల ట్యాబుల పంపిణీ జరిగింది. బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో జగన్ ట్యాబులను పంపిణీ చేస్తే మిగిలిన చోట్ల మంత్రులు, ఎంఎల్ఏలు పంపిణీ చేశారు. దీనివల్ల మూడు ప్రయోజనాలను జగన్ ఆశిస్తున్నారు.





మొదటిదేమో లక్షలాదిమంది విద్యార్ధులకు ఒకేసారి ట్యాబులను పంపిణీ చేయటం. ఈ ట్యాబుల ద్వారా విద్యార్ధుల సబ్జెక్టులకు అవసరమైన కంటెంట్ మొత్తం బైజూస్ యాప్ ద్వారా నిక్షిప్తమయ్యుంది. మామూలుగా ఎవరైనా విద్యార్ధి డైరెక్టుగా తీసుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చుపెట్టాలి. ఇపుడు ప్రభుత్వమే విద్యార్ధులకు ఉచితంగా కంటెంట్ మొత్తాన్ని అందిస్తోంది. నిజంగా బైజూస్ ఇస్తున్న కంటెంట్ చాలా బాగుంటోంది. వేల రూపాయల విలువైన కంటెంట్ ను తమకు ఉచితంగా అందించిన ప్రభుత్వాన్ని విద్యార్ధులే కాదు వాళ్ళ తల్లి, దండ్రులు కూడా మరచిపోలేరు.





ఇక రెండో ఉపయోగం ఏమిటంటే ట్యాబుల పంపిణీ మంత్రులు, ఎంఎల్ఏల చేతులమీదుగా జరగటం. తమకు ట్యాబులు ఇచ్చింది మంత్రలు, ఎంఎల్ఏలన్న విషయాన్ని విద్యార్ధులతో పాటు తల్లి, దండ్రులు కూడా గుర్తుపెట్టుకుంటారు. ట్యాబుల్లో బైజూస్ కంటెంట్ తప్ప విద్యార్ధులు మరేతర కంటెంట్ ను చూడటానికి లేకుండా ప్రభుత్వం కంట్రోల్ పెట్టేసింది. దీనివల్ల ట్యాబుల ద్వారా పిల్లలు అవాంచనీయమైన సైట్లను చూస్తారనే భయం తల్లి, దండ్రులకు అవసరంలేదు.





ట్యాబులను జగన్ ప్రభుత్వం ఒకేసారి 5.5 లక్షల మంది విద్యార్ధులకు ఇవ్వటమంటే మామూలు విషయంకాదు. రేపటి ఎన్నికల్లో వీళ్ళలో అందరు వైసీపీకి ఓట్లేస్తారని గ్యారెంటీలేదు. అయితే ఇందులో సగంమంది ఓట్లేసినా ఓ పది లక్షల ఓట్లు వైసీపీకి పడినట్లే కదా. రాజకీయనేతలు ఏమిచేసినా ఓట్లను, అధికారాన్ని దృష్టిలో పెట్టుకునే కదా చేస్తారు. చంద్రబాబునాయుడు గతంలో చేసేది కొంతైనా కొండంత ప్రచారం చేసుకున్నారు. ఇపుడు జగన్ చేసేది మాత్రమే ప్రచారం చేసుకుంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: