బుర్రకు ఎంత తోస్తే అంత రాసేయటం. తర్వాత సీన్ రివర్సయితే అబ్బెబ్బే తమ ఉద్దేశ్యం అదికాదు అంటు చెంపలేసుకోవటం. నాలుగు రోజుల్లో ఎల్లోమీడియాకు ఇది రెండో దెబ్బనే చెప్పాలి. మొదటేమో ఈనాడు దినపత్రికలో టీడీపీ నేత పట్టాభిని కొట్టారని రాసిన ఈనాడు తర్వాత పొరబాటైపోయిందని చెంపలేసుకున్నది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గబ్బుపట్టించటమే కానీ రాసిన రాత తప్పుడుదని చెంపలేసుకోవటం ఎప్పుడూ జరగలేదు.





ఇపుడు రెండోది ఏమిటంటే చెత్తపలుకులో ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా దాదాపు అలాంటి వివరణే ఇచ్చుకున్నారు. పోయిన ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కేసీయార్ వెయ్యి కోట్ల రూపాయల బంపరాఫర్ ఇచ్చారని రాశారు. దానిమీద జనసేన, పవన్ సోదరుడు నాగబాబు లాంటి వాళ్ళు ఫుల్లుగా ఫైరయ్యారు. ఇప్పటికే జగన్ అండ్ కో పవన్ను ప్యాకేజీస్టార్ అని ర్యాగింగ్ చేస్తున్నారు. దానికి మద్దతుగానే చెత్తపలుకు కథనం ఉండటంతో జనసేనకు మండిపోయింది.





వాళ్ళందరికీ సమాధానంగా అన్నట్లు తాజా చెత్తపలుకులో అపార్ధం కాదు..అర్ధం చేసుకోవాలి అని పెద్ద వివరణ ఇచ్చుకున్నారు. పవన్ కు కేసీయార్ ఆఫర్ ఇచ్చారు కానీ పవన్ అంగీకరించారని తాను ఎక్కడా రాయలేదని సమర్దించుకున్నారు. మరి కేసీయార్ ఆఫర్ ను పవన్ అంగీకరించారా ? లేకపోతే తిరస్కరించారా ? అన్నది తెలియకుండానే కేసీయార్ ఆఫర్ ఇచ్చినట్లు ఎలా రాశారు. కేసీయార్ ఆఫర్ ఇచ్చారంటేనే పవన్ ప్యాకేజీకి లొంగిపోయే రకమని ముద్రేయటమే కదా ?





పోయినవారం చెత్తపలుకులో పవన్ను ప్యాకేజీస్టార్ అన్నట్లుగా ముద్రేసేసి ఇపుడు తీరిగ్గా తన ఉద్దేశ్యం అదికాదని సమర్ధించుకోవటం ఏమిటి ? ఎల్లోమీడియా ద్వారా  పవన్ కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాజా చెత్తపలుకు చూసిన తర్వాత పవన్ను ప్రసన్నం చేసుకునేందుకు ఇచ్చుకున్న వివరణలాగే ఉంది. కేసీయార్ ఆఫరిచ్చారని రాసి వదిలేస్తే పవన్ కు ఎంత డ్యామేజి ? ఆ ఆఫర్ ఏమైందో కూడా రాయాలికదా. లేదా కేసీయార్ ఆఫర్ను తిరస్కరించిన పవన్ అని రాసున్నా అదో పద్దతిగా ఉండేది. ఏదేమైనా బుర్రకు తోచింది రాసేస్తాం తమను ఎవరు అడగకూడదంటే కుదరదంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: