రాబోయే ఎన్నికల్లో  ఏదైతే చేద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారో దాన్నే ఇప్పుడు నరేంద్రమోడీ ఫాలో అయిపోతున్నారా ? అనే సందేహం పెరిగిపోతోంది. ట్రాక్ రికార్డు సరిగా లేని, జనాల్లో పాజిటివ్ ఇమేజి లేని వాళ్ళకి వచ్చేఎన్నికల్లో టికెట్లు ఇచ్చేదిలేదని చాలాసార్లు జగన్ పదేపదే చెప్పారు. గడపగడపకి వైసీపీ అనే కార్యక్రమం సమీక్షల పేరుతో మంత్రులు, ఎంఎల్ఏలకు టికెట్ల విషయమై చాలా వార్నింగులే ఇచ్చారు.

ఎవరికి టికెట్లు ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వకూడదనే విషయంలో జగన్ కు ఈ పాటికే క్లారిటి వచ్చేసుంటుంది. అందుకనే రాబోయే ఎన్నికల్లో సుమారు 40 మందికి టికెట్లు రాదనే ప్రచారం బాగా జరుగుతోంది. టికెట్లు ఇచ్చేదిలేదని జగన్ చెప్పేసిన కారణంగానే ఇద్దరు ఎంఎల్ఏలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి క్రాస్ ఓటింగ్ చేసి టీడీపీ ఎంఎల్సీ గెలుపుకు సహకరించారు. ఇపుడిదంతా ఎందుకంటే కర్నాటకలో కూడా సేమ్ టు సేమ్ మంచి ఇమేజి లేని మంత్రులు, సిట్టింగ్ ఎంఎల్ఏలకు బీజేపీ టికెట్లు ఇవ్వటంలేదు.

టికెట్లను ఫైనల్ చేస్తు తయారుచేసిన జాబితాపై నరేంద్రమోడీ మండిపడ్డారు. దాంతో మొత్తం జాబితాను పార్టీ సీనియర్ నేతలు మార్చేయాల్సొచ్చింది. తాజా పరిణామాల ప్రకారం ప్రముఖులు, సీనియర్లు, మాజీ ముఖ్యమంత్రులు, సిట్టింగ్ ఎంఎల్ఏలకు కూడా టికెట్లు ఎగిరిపోయాయి. దాంతో మంత్రులు, సిట్టింగ్ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, సీనియర్ నేతలు సుమారు 14 మంది పార్టీకి రాజీనామాలు చేశారు.

మాజీ సీఎం జగదీష్ షెట్టర్, రఘుపతి భట్, ఎస్ అంగర, లక్ష్మణ్ సవది లాంటి ప్రముఖులు కూడా టికెట్లు రాలేదన్న కారణంగానే బీజేపీకి రాజీనామాలు చేసేశారు. వీళ్ళల్లో చాలామంది తిరుగుబాటు అభ్యర్ధులుగానో కాంగ్రెస్ లేదా జేడీఎస్ లోకో వెళుతున్నారు. బీజేపీ టికెట్లు ఇవ్వని వాళ్ళల్లో ఇతర పార్టీల్లోకి వెళ్ళి లేదా ఇండిపెండెంట్లుగా పోటీచేసి ఎంతమంది గెలుస్తారు ? బీజేపీ విజయావకాశాలను దెబ్బకొడతారో తెలీదు. సేమ్ టు సేమ్ రాబోయే ఎన్నికల్లో వైసీపీలో కూడా ఇలాగే జరిగే అవకాశాలున్నాయి. అందుకనే కర్నాటక ఎన్నికలు ఇంట్రెస్టింగుగా మారుతున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: