ఇటీవల కాలం లో చదువు పేరెత్తితే విద్యార్థులు ఎంతలా భయపడిపోతున్నారో.. ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. అప్పటివరకు సంవత్సరం అంతా చదువును అటకెక్కించే విద్యార్థులు.. పరీక్షలు వచ్చాయి అంటే చాలు పుస్తకాల పురుగుల్లా మారి పోతూ ఉంటారు. సంవత్సరం మొత్తం చదవాల్సిన సబ్జెక్టును కేవలం నెల రోజుల్లోపూర్తి చేయాలి అని టార్గెట్ పెట్టుకొని తెగ చదివేస్తూ ఉంటారు. ఇలా చదివిన వారు కొంత మంది పరీక్షల్లో పాస్ అయితే.. మరి కొంతమంది మాత్రం ఫెయిల్ అవుతూ ఉంటారు అని చెప్పాలి.



 అయితే సాధారణం గా స్కూల్ దశలో విద్యార్థులు ఎవరైనా సరే స్నేహితులతో ఆడుకోవడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఇక ప్రతి రోజు స్కూల్ కి వెళ్లడానికి.. టీచర్లు చెప్పే పాఠాలను వినడానికి పెద్దగా ఆసక్తి కనబరచరు అన్న విషయం తెలిసిందే. ఇలా విద్యార్థులందరూ కూడా స్కూల్ ని ఎలా ఎగ్గొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటే కొంతమంది మాత్రం చిన్నవయసులోనే ఏకంగా పెద్ద పెద్ద రికార్డులు సాధిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కు చెందిన పదేళ్ల ఆయాన్ గుప్తా కూడా ఈ కోవలోకే చెందినవాడు.



 సాధారణంగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థి వయసు 15 ఏళ్లు ఉంటుంది. కానీ యూపీ కి చెందిన అయాన్ గుప్తా మాత్రం పదేళ్ల వయసులోనే టెన్త్ పరీక్షలు రాసి పాసయ్యాడు. ఆ బాలుడికి టెన్త్ పరీక్షల్లో 76.6% మార్కులు వచ్చాయి. గత ఏడాది తొమ్మిదవ తరగతి పాసైన అయాన్ ఈ ఏడాది టెన్త్ పాస్ అయ్యాడు అని చెప్పాలి. అయితే అయాన్ గుప్త లాక్ డౌన్ టైంలో పై తరగతి పుస్తకాలు చదివేశాడని.. అతడి టాలెంటును అర్థం చేసుకుని ఇక ఇప్పుడు ఏకంగా పదవ తరగతి పరీక్షలు రాసేందుకు ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నట్లు స్కూలు ప్రిన్సిపల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: