అక్క తమ్ముడు మధ్య రిమోట్ కోసం జరిగిన గొడవతో మనస్థాపం చెంది అక్క ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం లో వెలుగులోకి వచ్చింది. పొలం పనుల నిమిత్తం బయటకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి కూతురు విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించారు.