వైసీపీ ప్రభుత్వం వచ్చి 16 నెలలు కావొస్తుంది. అంటే మరో 14 నెలల్లో జగన్ మరోసారి మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. అయితే ఈ విస్తరణలో కొందరిని రీప్లేస్ చేయడం ఖాయమని పలువురు రాజకీయ విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు. ఈ 16 నెలల కాలంలో కొందరు మంత్రులుగా పూర్తిగా నిలదొక్కుకోలేదని, అలాగే శాఖలపై పట్టు తెచ్చుకున్నట్లు కనిపించడం లేదని చెబుతున్నారు.