ఆంధ్రప్రదేశ్ లో చర్చలకు దారితీస్తున్న అంతర్వేది ఘటన.. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథం తగులబెట్టిన దుండగులను వెంటనే శిక్షించాలంటూ టీడీపీ నేతలు నిరసనకు దిగారు. నగరంలోని మెట్టు బండ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద పూజలు నిర్వహించి ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న సారధ్యంలో నిరసనను ఉద్రిక్తంగా మార్చారు.