ఇటీవలే క్యాబినెట్ మీటింగ్ మేమంతా మర్చిపోయిన ఓ విషయాన్నీ ప్రస్తావించారని ఆయన జ్ఞాపక శక్తి కి మేమంతా బిత్తరపోయామని మంత్రి పేర్ని నాని చెప్పారు. కృష్ణానది నీటిని ఒడిసి పట్టే విషయంలో ఎన్నికలకు ముందు ప్రజాసంకల్ప యాత్రలో జిల్లా రైతులకు జగన్ హామీ ఇచ్చారు.కృష్ణానదిపై అవనిగడ్డ దగ్గర, మరో చోట.. రెండు ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధ చేయాలని,ఎంత ఖర్చయినా వెనుకాడవద్దని కూడా సీఎం జగన్ మంత్రి పేర్నినానిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన కేబినెట్ భేటీ లో ఎవరూ ప్రశ్నించకుండానే జగన్.. ఈ విషయాన్ని లేవనెత్తడంతో అయన జ్ఞాపక శాంతి కి అందరు అబ్బురపడుతున్నారట..