తెలంగాణ లో ఆసక్తి కర రాజకీయం మొదలు కాబోతుంది.. ఎన్నికలు మొదలవుతున్న వేళా అన్ని పార్టీ లు తమ తమ అస్త్రాలను సిద్ధం చేసుకుని ప్రత్యర్థులను మట్టికరిపించేందుకు సిద్ధమవుతున్నాయి.. ఇప్పటికే దుబ్బాక లో ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో రాజకీయం కాస్త వేడెక్కగా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారుతున్నాయి.. ఇప్పటికే ఈ ఎన్నికలపై టి ఆర్ ఎస్ పార్టీ తరపున కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారని సమాచారం వస్తుంది.. ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీ లనుంచి ఎటువంటి పోటీ ఎదురవుతుందో అని అందరు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు..