ఎంపీగా గెలిచింది వైసీపీ నుంచి...కానీ అదే పార్టీకి ప్రతిపక్షంగా తయారయ్యారు రఘురామకృష్ణంరాజు. గత కొంతకాలంగా ఈయన అధికార వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రతిరోజూ మీడియా సమావేశాలు పెట్టడం, జగన్, ఇంకా వైసీపీ నేతలపై ఆరోపణలు చేయడం చేస్తున్నారు. తాజాగా రాజుగారికి సంబంధించిన కంపెనీపై సిబిఐ దాడులు జరిగాయి. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని ఎంపీనే స్వయానా వెల్లడించారు.