ఢిల్లీ నుండి స్థానిక సంస్థలకు, హైదరాబాద్ అభివృద్ధి కోసం నిధులు ఇచ్చే అవకాశం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఒకవైపు చెబుతుంటే మరోవైపు ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ మాత్రం కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామంటూ అబద్దాలతో ఊదర గొడుతున్నాడని రాష్ర్ట మంత్రి హరీశ్‌రావు అన్నారు. జీహెచ్ఎంసీ పఠాన్‌చెరు డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి మెట్టుకుమార్, భారతీనగర్ డివిజన్ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డికి మద్దతుగా మంత్రి హరీశ్‌రావు నేడు ప్రచారం నిర్వహించారు.