మంత్రాలయం మఠానికి చెందిన 208 ఎకరాల భూముల బహిరంగ వేలం, ఆస్తుల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దేవాదాయ శాఖకు చెందిన భూములకు ప్రభుత్వం కేవలం ట్రస్టీగా మాత్రమే వ్యవహరించాలి. ఆస్తులను సంరక్షించాలి తప్ప అమ్ముకోవడానికి వీలు లేదు. దీనికి సంబంధించి హైకోర్టు తీర్పు కూడా ఉంది. ప్రజల దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం వల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది .. ఇప్పుడు బుర్ర పెట్టీ ఆలోచించాలి అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.. ప్రస్తుతం ఆ ట్వీట్ రాజకీయ రచ్చలతో పాటుగా వైరల్ అవుతుంది..