బ్రేకింగ్... బండి సంజయ్ పై పోలీసు కేసు నమోదు..భాజపా రాష్ట్ర అధ్య క్షుడు, ఎంపీ బండి సంజయ్, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై హైదరాబాద్ లోని సంజీవ రెడ్డినగర్ పోలీసులు శుక్రవారం వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. బల్దియా ఎన్నికల ప్రచార సభ, రోడ్ షోల్లో పాల్గొన్న వీరిద్దరూ భావోద్వేగాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని సాక్ష్యాధారాలను సేకరించిన పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు.