హరీష్ రావు నగర పర్యటన, రోడ్ షో లు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్ల పరిధిలోని మైనార్టీ నాయకుల సమావేశాల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. మున్నూరుకాపు సంఘం సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిద పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.జీహెచ్ఎంసీ ఎన్నికలకు బీజేపీకి చెందిన నేతలు వరుసకట్టి హైదరాబాద్కు రావడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు..ఓట్ల కోసం బురద రాజకీయాలు చేస్తున్న ఆ పార్టీ నాయకులకు నగర ప్రజలపై ఏమాత్రం అభిమానం ఉన్నా కనీసం రూ.2 వేల కోట్ల వరద సాయంతో ఇక్కడకు రావాలని' ఆర్థిక శాఖ మంత్రి పేర్కొన్నారు.