మంత్రి హరీష్ రావు నగరంలోని రామ చంద్రాపురం డివిజన్ లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రామచంద్రాపురం డివిజన్ అభ్యర్థి పుష్పానగేశ్‌తో కలిసి అశోక్‌నగర్‌లో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఒకరేమో దారుస్సాలాం కూలుస్తానంటాడు.. మరొకరు పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూలుస్తామని చెప్తున్నాడు.. కానీ, ప్రజలకు ఏం చేస్తారో మాత్రం చెప్పడం లేదు అంటూ దుయ్యబట్టారు.