గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్ 1 సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలను నిలిపివేయనున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క బల్క్ మద్యం కొనుగోళ్లు, విక్రయాలపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆబ్కారీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.