ఓట్ల కోసం మరో అస్త్రాన్ని ప్రయోగించిన సర్కార్.. రేషన్ బియ్యాన్ని వచ్చే నెల అంటే డిసెంబర్ నుంచి ఒక రూపాయికి కిలో బియ్యం ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయించింది. అంత్యోదయ కార్డున్న వారికి ఒక్కో కార్డుపై 35 కిలోల బియ్యం ఇస్తారు. ఈ బియ్యానికి కూడా కిలోకు రూపాయి వసూలు చేస్తారు. అన్నపూర్ణ కార్డులున్న వారికి ఒక్కో కార్డుపై 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తారు.