అనంతపురం రూరల్ పరిధిలోని నర్సినాయనికుంటకు చెందిన వెంకటేష్ నాయక్ ఎస్టీ కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. బిర్యానీపై మక్కువతో అతని స్నేహితుడు రామాంజి నాయక్తో కలసి కన్నింగ్ ప్లాన్ వేశాడు. ఫ్రీగా బిర్యానీ కొట్టేయాలన్న దుర్బుద్ధితో ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారమెత్తాడు. దానికి అతని ఫ్రెండ్ కూడా సపోర్ట్ కూడా చేయడంతో ఈ కథ ఇంకాస్త ఆసక్తికరంగా మారింది..పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది..