గ్రేటర్ హైదరాబాద్ లో ముగిసిన ఎన్నికల ప్రచారం, బంద్ అయిన మద్యం అమ్మకాలు..సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఓటర్లను ఆకర్షిస్తున్నారు.మెజారిటీ ఓటర్ల వద్ద స్మార్ట్ఫోన్లు ఉండటంతో అభ్యర్థులు ఒక్కో ఓటరును లక్ష్యంగా పెట్టుకొని తెరవెనుక ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఫోన్లో వాయిస్ మేసేజ్లతో మొదలు కొని, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లో ఆకట్టుకునే పోస్టర్లను పోస్ట్ చేస్తున్నారు.గ్రేటర్ హైదరాబాద్ ప్రజల వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. నిరక్షరాస్యులు సైతం స్మార్ట్ఫోన్లు వాడుతుండటంతో అభ్యర్థులు సోషల్ మీడియాను వేదికగా మార్చుకొని ఓట్లు కోసం హడావిడి చేస్తున్నారు.