మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్‌కు చేరుకున్న చిరంజీవి దంపతులు ఓటు చేశారు. కానీ మీడియా తో మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయారు.. చిరు సైలెంట్ వెనక ఏ రహస్యం దాగుందో తెలియలేదు..అమీర్‌పేటలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుమారుడు భార్యతో కలిసి ఓటు వేసారు అంజనీకుమార్. ప్రశాంత ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని.. ప్రజలు నిర్భయంగా ఓటు వినియోగించుకోవాలని ఈ మేరకు పిలుపునిచ్చారు..