...జగన్ కి సుప్రీం కోర్టులో పెద్ద రిలీఫ్ లభించింది. గత కొద్ది రోజులుగా సీఎం జగన్ ముఖ్యమంత్రి పదవి కోల్పోతారంటూ ప్రచారం చేస్తున్న వారికి సుప్రీం కోర్టు గట్టి షాకే ఇచ్చింది. జగన్ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. సీఎం జగన్పై దాఖలైన పిటిషన్లకు విచారణ అర్హత లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. సీఎం జగన్పై జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేయడం జరిగింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ రాసిన లేఖను మీడియాకు విడుదల చేయడంపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరడం జరిగింది.