రైతు బిల్లులు ఉపసంహరించుకోవాలంటూ మంగళవారం రైతులు భారత్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా లేకపోయినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం పెద్ద ఎత్తున బంద్ పాటిస్తామని ప్రకటించింది. ఏపీలో కూడా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఈ తరుణంలో భారత్ బంద్పై జగన్ ప్రభుత్వం ఆచితూచి స్పందించింది. ఏపీలో బంద్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది.