తెలంగాణలో మరో విషాదం.. సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయిన యువ జంట తెల్లారేసరికి విగతజీవులుగా కనిపించారు. మునగాల మండల పరిధిలోని మోద్దుల చెరువు శివారులో వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చివ్వెల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన నవీన్, మహేశ్వరి లు రాత్రి ఇంట్లో నుంచి వెళ్లి పోయి అక్కడ చెట్టుకు ఉరివేసుకొని ప్రాణాలను తీసుకున్నారు.