రేషన్ ద్వారా పేదలకు అందిస్తున్న చక్కెర ప్యాకెట్లు డీలర్లకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ప్రభుత్వం ప్రతి కార్డుదారుడికీ అర కిలో చక్కెర సరఫరా చేస్తోంది. గతంలో బస్తాలలో చక్కెర సరఫరా చేస్తుండగా ప్రస్తుతం ప్రభుత్వమే ప్యాకెట్ల రూపంలో చక్కెరను డీలర్లకు సరఫరా చేస్తోంది.ఈ ప్యాకెట్లు 500 గ్రాములకు బదులు కవర్లతో కలిపి 15 నుంచి 20 గ్రాముల మేర అదనంగా ఉన్నాయి. అంటే చక్కెర ప్యాకెట్ బరువు 515 నుంచి 520 గ్రాములు ఉన్నాయి. దీంతో బస్తా కు 20 ప్యాకెట్ల వరకు నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..