తెలంగాణ లో బీజేపీ ప్రభంజనం అందరు గమనిస్తూనే ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలతో మొదలైన వారి ప్రభంజనం నిన్నటి గ్రేటర్ ఎన్నికల వరకు కొనసాగుతూ వచ్చింది. క్రమక్రమంగా వారి బలం రాష్ట్రంలో పుంజుకుంటూ వచ్చి గెలిచేంతవరకు వచ్చింది.. దుబ్బాక లో గెలిచిన విజయోత్సాహం గ్రేటర్ లో కనపరిచి మంచి ఫలితాలు సాధించారు. అక్కడ కేసీఆర్ లాంటి నాయకుడిని బీజేపీ కంగు తినిపించింది అంటే పార్టీ లో నాయకత్వం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు..