రైతులకు గుడ్ న్యూస్... రైతు భరోసాతో పాటు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లిస్తున్న జగన్ ప్రభుత్వం...ఈ నెల 29వ తేదీన వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రూ. 2 వేలుతో పాటు ఇన్పుట్ సబ్సిడీ కూడా చెల్లించబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌కు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.