రుతుక్రమం పై భర్తకు భార్య నిజం దాచిపెట్టడంచేత భర్త ఆమె నుంచి విడాకులు కోరాడు. వివరాల్లోకి వెళితే.. మంత్లీ పై అపోహలను తొలగించేందుకు ప్రపంచ వ్యాప్తంగా మహిళలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. ఓ ప్రయివేటు ఉద్యోగి ఏకంగా ఇదే కారణంతో భార్యనుంచి విడాకులు కోరడంపై విస్మయం వ్యక్తమవుతోంది. సరిగ్గా పెళ్లిరోజు తాను నెలసరిలో ఉన్నానంటూ ఆమె చెప్పడంతో తాను, తన తల్లి షాక్ అయ్యామనీ.. ఈ ఘటన తమ ''విశ్వాసాన్ని దెబ్బతీసిందని'' అతడు తన విడాకుల పిటిషన్లో చెప్పుకొచ్చాడు.