సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే సత్వరమే రోహింగ్యాలు, సంఘ విద్రోహశక్తుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. అంతేకాదు.. త్వరలోనే బస్సు యాత్ర చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.తెలంగాణలో భాజపా బలపడుతుందని గుర్తించి ఆదరాబాదరాగా ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల కమిషన్.. మేయర్ ఎన్నిక ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. అటల్ బిహారీ వాజపేయి ఆశయాలకు అనుగుణంగా దేశంలోని రైతులకు అండగా ఉండేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. రేపు వాజ్పేయీ జయంతి సందర్భంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లను జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని బండి అన్నారు.