ఈ మధ్యకాలంలో ఢిల్లీలో ఎక్కువగా భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. దాంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు టెన్షన్ పడుతున్నారు. కాగా ఈ తెల్లవారు జామున మరో సారి భూ ప్రకంపనలు టెన్షన్ పెట్టాయి. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఢిల్లీలోని నంగలోయి ప్రాంతంతోపాటు ఎన్సీఆర్, నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించింది.