ఆన్ లైన్ లోన్ యాప్ కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూర్‌లోని రెండు కాల్సెంటర్లపై హైదరాబాద్ పోలీసుల దాడులు చేశారు. 42 లోన్ యాప్‌లను లీఫంగ్, పిన్ ప్రింట్, నబులోం, హాట్‌ఫుల్ టెక్నాలజీస్ సంస్థలు నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో 27 కేసులు నమోదు చేశారు. 350 అకౌంట్ల నుంచి డబ్బు జమ అవుతున్నట్లు గుర్తించారు. మొత్తం రూ.87 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు.