అమెజాన్ లో 'హెల్త్ అండ్ ఫిట్నెస్ ఫెస్ట్' పేరిట వ్యాయామ ఉపకరణాలపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. నూతన సంవత్సరం దగ్గర పడనున్న నేపథ్యంలో ప్రజలంతా ' న్యూఇయర్ రిజల్యూషన్స్'లో భాగంగా ఫిట్నెస్పై దృష్టిసారించే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాయామ సంబంధిత ఉపకరణాలపై ఈ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు జనవరి 2, 2021 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఫిట్నెస్ ట్రాకర్లు, స్మార్ట్ వాచ్లు, ఆరోగ్య సంబంధిత ఉపకరణాలు అందుబాలులో ఉన్నాయి.