పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లి శివారులో మంగళవారం చోటు చేసుకుంది. పాలకోడేరు ఎస్సై ఏజీఎస్ మూర్తి కథనం ప్రకారం.. భీమవరం మండలం యనమదుర్రుకు చెందిన సీడే పరశురాముడు, ధనసావిత్రి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. సావిత్రి స్నేహితురాలైన అత్తిలికి చెందిన చోడిశెట్టి హైమావతి అధిక వడ్డీ ఇస్తానని.. పది రోజులకోసారి సొమ్ము చెల్లిస్తానని వీరిని నమ్మించింది.దాంతో ఆ దంపతులు స్నేహితులు బంధువుల దగ్గర అప్పు చేసి మరి దాదాపు 25 లక్షలు ఇచ్చారు. అదే వారి ప్రాణానికి పెద్ద గుది బండ లా మారింది.. హాయిగా సాగిపోవాల్సిన జీవితాలను తుంచివేసింది..