ఏకపక్షంగా ప్రకటించిన నూతన ప్రైవసీ పాలసీతో యూజర్లంతా తమ ప్రత్యర్థి యాప్ సంస్థలు టెలిగ్రామ్, సిగ్నల్ వైపు చూస్తుండటంతో ఫేస్బుక్ అనుబంధ వాట్సాప్ తాజాగా మరో వివరణ ఇచ్చింది. తమ నూతన ప్రైవసీ పాలసీపై ప్రభుత్వం నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానమిస్తామని వాట్సాప్ హెడ్ విల్చాత్కార్ట్ పేర్కొన్నారు.గత కొంతకాలంగా ప్రజల్లోకి తప్పుడు సమాచారం తీసుకువెళ్తుందని వాట్సాప్ పై ప్రభుత్వం నుంచి విమర్శలు రావడంతో ఆ దిశగా ఈ ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థ పలు జాగ్రత్త చర్యలు చేపట్టింది..