ఫోన్ కొన్న కొద్ది రోజులు ఫోన్ ఛార్జింగ్ బాగా ఉంటుంది.చాలా సేపటివరకు చార్జింగ్ అలాగే ఉంటుంది. రాను రాను బ్యాటరీ పనితీరు మందగిస్తుంది. చాలా స్లోగా చార్జ్ అవ్వడం.. తొందరగా చార్జింగ్ పోవడం లాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఛార్జింగ్ పెట్టే టప్పుడు ఫోన్ ను గట్టిగా పక్కన పడేయడం లేదా కేబుల్‌ను చార్జింగ్ పోర్ట్‌లో బలంగా పెట్టి తీస్తూ ఉంటారు. దీనివల్ల చార్జింగ్ పోర్ట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల చార్జింగ్ స్లో గా అవుతుంది. చార్జర్, యూఎస్బీ కేబుల్‌లో ఏదైనా ఇబ్బంది ఉన్నా స్లోగా చార్జ్ అవుతుంది.