రెడ్ బస్ అని భ్రమపడి ఆ నంబర్లకు కాల్ చేశారు. వాళ్ళు అడిగిన ఓటీపిని చెప్పాడు.క్షణాల్లో ఖాతా నుంచి డబ్బులు పోయాయి. ఆ విషయం ఫోన్ మెసేజ్ ద్వారా తెలుసుకున్న రాజు నిర్ఘాంతపోయారు. నమ్మలేక వెంటనే ఏటీఎమ్ కు వెళ్లి చెక్ చేసుకున్నాడు. అకౌంట్లో రూ.1.11లక్షలు ఉండాల్సి ఉండగా.. రూ. 6వేలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మోసపోయానని గ్రహించిన ఆయన నాంపల్లిలోని సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించారు.