హైదరాబాద్ లో కొన్ని లక్షల పావురాలకు ఆవాసం. రోజూ కొన్ని వేల మంది వీటికి తిండి గింజలు వేస్తుంటారు. 500 ప్రాంతాల్లో ప్రత్యేకంగా తిండి గింజలు వేసే కేంద్రాలున్నాయి. చాలా మందికి ఇలా తిండి గింజలు వేసి.. వాటితో సెల్ఫీ దిగడం అలవాటు. కొద్ది రోజుల వరకు ఈ అలవాటును మానుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బర్డ్ ప్లూ ప్రబలుతున్న నేపథ్యంలో వాటిని ఎక్కువగా తాకకూడదని అంటున్నారు..