చిరుత పులిని బంధించి, వధించి, చంపి దాని మాంసాన్ని వండుకుని తిన్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ ఘటన జరిగింది. 74 ఏండ్ల కురియాకోస్, 45 ఏండ్ల వినోద్ కలిసి మునిపారా అటవీ సమీపంలోని మంకులర్లో ట్రాప్ వేయగా బుధవారం ఒక చిరుతపులి చిక్కింది. దీంతో దానిని బంధించి వినోద్ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆ చిరుతను చంపి మాంసాన్ని వండుకుని తిన్నారు. ఈ ఘటన అందరికి తెలియడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు..