ఆన్లైన్ డేటింగ్ యాప్లతో ప్రజలను మోసం చేశారని ఇంటర్పోల్ కు పలు దేశాల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తాజాగా అంతర్జాతీయ పోలీసు సంస్థ తాజా హెచ్చరిక జారీ చేసింది. డేటింగ్ యాప్ ల సాయంతో ప్రజలను మోసగించే మోడస్ ఆపరేషన్ పై ఇంటర్ పోల్ ప్రజలను అప్రమత్తం చేసింది. 194 సభ్యదేశాలకు ఇంటర్ పోల్ ఈ హెచ్చరిక జారీ చేసింది. డేటింగ్ యాప్ వల్ల మీరు మీ బ్యాంకు ఖాతాలోని డబ్బు కోల్పోవచ్చని హెచ్చరించింది.