తిరుపతిలో పర్యటించిన పవన్ బీజేపి తో దోస్తీ పై కీలక వ్యాఖ్యలు చేశారు.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ నిబద్ధతతో, కలసికట్టుగా పోటీ చేసిన తీరులోనే తిరుపతి ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయాల్సివుందని, అప్పుడే తమ కూటమికి విలువ వుంటుందంటూ వ్యాఖ్యానించారు. ఆయన మాటలను బట్టి చూస్తే..తిరుపతి ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి బీజేపీ నుంచే వుంటారన్న భావన కలుగుతోందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జనసేన పార్టీ నుంచీ ఉమ్మడి అభ్యర్థి వుంటే శ్రేణులు పూర్తిస్థాయిలో ఉత్సాహంగా ఎన్నికల్లో పనిచేస్తాయని, బీజేపీ అభ్యర్థి అయితే మాత్రం ఆ స్థాయిలో శ్రేణులు పనిచేయకపోవచ్చునని ఆ వర్గాలే వెల్లడించాయి. పవన్ ఇలా అన్న రెండో రోజే సోము కలవడం చర్చనీయాంశంగా మారింది.