ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన మదన పల్లి ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.. మదనపల్లెలో ఇద్దరు కుమార్తెలను మంత్రాల పేరుతో కన్న తల్లే హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ జంట హత్యల ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుల్లో ఒకరైన సాయి దివ్య మూడు రోజుల క్రితం సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెట్టినట్లుగా విచారణలో తేలింది. 'శివ ఈజ్ కమ్.. వర్క్ ఈజ్ డన్' అంటూ యువతి పోస్టులు పెట్టడం పలు అనుమానాలకు తెర తీస్తుంది.